24, జులై 2017, సోమవారం

వుత్తరాంద్రా గుండె చప్పుళ్ళు-తప్పెట గుళ్ళు

వుత్తరాంద్ర (విశాఖ,విజయనగరం,శ్రీకాకుళం) ప్రాంతంలో శతాబ్దాల      క్రితం పురుడుపోసుకున్న జానపద నృత్య కళ "తప్పెట గుళ్ళు". 15-20 మంది గల కళాకారుల బృందం కాళ్ళకు కట్టిన గజ్జెలు, మెడలొ వేల్లాడుతున్న డప్పు వాద్యలను లయబద్దంగా మ్రోగిస్తూ, వలయాకారంలో తిరుగుతూ, పాడుతు నృత్యాలు చేస్తారు. యాదవ(గొల్ల) సామాజిక వర్గం వారు ఈ జానపద కళకు కారకులుగా చరిత్రకారులు చెపుతున్నారు. ఈ ప్రదర్శనలో రామాయణ,భారత, భాగవత ఘట్టాలు ప్రధానంగా   ప్రస్తావన చేస్తుంటారు. గతమెంతో ఘనచరిత్ర  వున్న ఈ జానపద నృత్యం - ఆధునిక సాంకేతిక కారణంగా కొడిగడుతున్న కళలలో వొకటిగా చేరి,  నేడు కనుమరుగు అయిపోయే పరిస్థితిలో వుంది. మూడు, నాలుగు బృందాలుగా మాత్రమే మిగిలి వున్న ఈ ప్రాచీన జానపదకళను పరిరక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఎంతో వుంది. కొన్ని దశాబ్దలుగా నిర్లక్ష్యానికి గురి అవుతూ వస్తున్న ఈ "తప్పెట గుళ్ళను" నూతన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వం అయినా ఆదరించి, అక్కున చేర్చుకొని- భవిష్యత్ తరాలకు అందించే బృహత్ కార్యాన్ని తలపెడుతుందని ఆకాంక్షిద్దాం.           

కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహిళా క్రికెట్ టీం

ఈ జట్టు అబలల జట్టు కాదు. భారత పతాకను విశ్వ క్రీడా వేదికపై సగర్వంగా రెప రెపలాడించిన సబలల జట్టు.  వీరు మహిళల వరల్డ్ కప్ తృటిలో కోల్పోయి వుండవచ్చు, కానీ కోట్లాది భారతీయుల, ప్రపంచవ్యాప్త క్రీడాభిమానుల అమూల్య అభిమానాన్ని సాధించుకొచ్చారు. సుమారు నెల రోజుల క్రితం అదే గడ్డపై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మన పురుషుల జట్టు వోటమి.  ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ ఫైనల్ లో మహిళా జట్టు వోటమి.  రెండు వోటములకు మధ్య ఎంతో తేడా . చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్థాన్ చేతిలో ఎటువంటి పోరాటం చేయకనే, చిత్తుగా వోడి అశేష భారత అభిమానుల ఆగ్రహాన్ని,  చీత్కారాలను మూటగట్టుకుంది పురుషుల జట్టు.అంచనాలు లేని జట్టుగా వుమెన్స్ వరల్డ్ కప్ బరిలోకి దిగి, అంచెలంచెలుగా అద్బుథ విజయాలను సాధించి, ఫైనల్లో పోరాడి వోడి క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది మన మహిళల జట్టు.  భారత క్రికెట్ కు సుదీర్ఘ సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ కు కప్ ను బహుమతిగా  అందించాలన్న లక్ష్యంతో దోని సారద్యంలోని భారత పురుషుల జట్టు అద్బుత  ప్రదర్శన చేసి 2011
వరల్డ్ కప్ ను సాధించింది. ఇప్పుడు అదే విధంగా మహిళల క్రికెట్ కు సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న జులన్ గోస్వామి, మిథాలి రాజ్ లకు ప్రపంచ కప్ అందించాలన్న దృడ లక్ష్యంతో యువ మహిళల జట్టు కదం తొక్కింది. లక్ష్యసాధన ముంగిట తడబడినా, భారత మహిళా క్రికెట్ పతాకను సరికొత్త కీర్తి శిఖరానికి చేర్చారు. 1983 వరల్డ్ కప్ సాధించి కపిల్ డెవిల్స్ టీం  భారత క్రికెట్ లో కొత్తశకాన్ని ఎలా ఆరంభించిందో ...ఇప్పుడు మిథాలీ సేన అలాగే భారత మహిళ క్రికెట్ లో నూతన అధ్యయాన్ని లిఖించింది. మహిళల క్రికెట్ఇక  ఎంత మాత్రం చులకన కాదు.ఇక ప్రతి అడుగు సంచలనమే. హేట్సాఫ్ ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీం . 

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...