29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

తెలుగు రాష్ట్రాలలో తమిళ పర్యాటక ప్రచార దందా..!

               
ది 29-09-2017 వ తేదీ సికింద్రాబాద్ నుండి ఏలూరు వెళ్ళుటకు రైల్వే బుకింగ్ లో ఇచ్చిన ప్రయాణ టికెట్ ఇది. ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాలలో.  ఇచ్చిన రైల్వే టికెట్ పై ముద్రించిన ప్రచార చిత్రాలు తమిళనాడు పర్యాటకానికి సంబంధించినవి.  విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో రెండు తెలుగు రాష్ట్రాలకంటే ముందు మాత్రమే కాదు, దేశంలోనే ముందంజలో ఉంది తమిళనాడు రాష్ట్రం.  రైల్వే కేంద్ర ప్రభుత్వం పరిది కదా..?  వారి ఇష్టం అంటారా..! పర్యాటకులను ఆకర్షించడంలో రైల్వేలది కీలక పాత్ర.  ఇటువంటి అత్యుత్తమ ప్రచార సాధనన్ని ఉదారంగా తమిళనాడుకు కేటాయించడం సముచితం కాదు.  ఇది చిన్న విషయమే కావచ్చు.  కాని పర్యాటకంలో అగ్రస్థానంలో ఉన్న తమిళనాడు ఈ అవకాశాన్ని వదులుకోలేదుగా..?  మరి తెలుగు రాష్ట్రాలు ఎందుకు వదులుకోవాలి..? ఈ విషయం తెలంగాణా, ఆంధ్ర ప్రభుత్వాల దృష్టిలో లేదా..? సంబందించిన విషయం కాదా..?  అన్ని విషయాలలో పోటీ పడే ఇరు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు ఈ తమిళనాడు ప్రచార దందాకు ముగింపు పలికి,  తెలుగు రాష్ట్రాల పర్యాటకానికి కేటాయించేలా చర్యలు చేపట్టాలి.       

27, సెప్టెంబర్ 2017, బుధవారం

అలుపెరుగని ఆంధ్రుడు చలసాని శ్రీనివాస్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉదృత ఉద్యమ సమయంలో- పార్టీలకు అతీతంగా సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ముఖ్యులు చలసాని శ్రీనివాస్. ఆ ఉద్రిక్త పరిస్థితులలో ఆయన ఎన్నో భౌతిక దాడులను ఎదుర్కొన్నారు. నిరంతరం సామరస్యపూర్వక పంథాలోనే సమైఖ్య రాష్ట్ర ఆవశ్యకతపై వివిధ సభలు, సమావేశాలు, చర్చా వేదికల ద్వార గళం వినిపించిన మేధావి. ఈ సందర్భంలో కొన్ని వేల పుస్తకాలను , లక్షలలో పత్రాలను స్వంత ఖర్చుతో ముద్రించి, పంపిణీ చేశారు. పలుమార్లు తమ బృందంతో ఢిల్లీ వెళ్ళి ఆనాటి అన్ని పార్టీల అగ్ర నాయకులను కలసి ఉద్యమానికి మద్దతు కూడ గట్టే ప్రయత్నాలు చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తదుపరి ప్రొ. కోదండరాం  పరిస్థితిలానే, నూతన ఆంద్రప్రదేశ్ లో చలసాని సేవలు విస్మరించబడ్డాయి. నాటి చలసాని బృందంలోని వారిలో అధిక శాతం వివిధ రాజకీయ పార్టీల పంచన చేరి రాజకీయ ఆశ్రయం సంపాదించుకోగా, ఈయన మాత్రం విభజన హామీల అమలు సాదనకై అలుపెరుగని పోరాటానికే సిద్దమయ్యారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్, మారుమూల గిరిజన గ్రామాలలో అనారోగ్య సమస్యలు, అగ్రిగోల్డ్ భాదితుల పక్షాన...ఇలా నిరంతరం రాష్ట్ర సమస్యలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృస్టికి తెచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు.    నాటి విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ ను రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టాలని పిలుపునిచ్చి, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు భరోసాను ఇచ్చిన బిజెపి కు మద్దతు పలికారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు విస్మరించిందని ప్రస్తుతం  బిజెపిపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చలసాని మిత్రులు, అభిమానులలో బిజెపి సానుభూతిపరులు అధికంగా ఉన్నాసరే, బిజెపి ని దునుమాడడంలో వెనుకంజ వేయడం లేదు. ఈ ముక్కుసూటి తనమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలలో చలసాని వంటి ఆలోచనపరుడు, మేధావి సేవలను వినియోగించుకోవడంలో సందేహపడేటట్లు చేస్తుందంటున్నారు రాజకీయ నిపుణులు. "రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం" అని నమ్మిన సిద్ధాంతం కోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న చలసాని శ్రీనివాస్ వంటి నిబద్దత గల వ్యక్తుల అవసరం ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో వుంది. అధికారంలో ఏ పార్టీ వున్నా రాజకీయాలకు అతీతంగా ఇటువంటివారి సేవలను వినియోగించుకోవాలి.       

23, సెప్టెంబర్ 2017, శనివారం

క్షేమంగా ఎదుగు బంగారుతల్లి

 వీధిలోను, నడిచే దారిలోను, బస్, రైళ్ళలోను, 
బడిలోను, కళాశాలలోను...
అన్ని చోట్లా విచ్చుకున్నాయి, విచక్షణ లేని
రొచ్చు ముళ్ళు.

కనుపాపలా అనుక్షణం నిను
కాచుకొంటున్నా,
ఏ ముప్పు ఏ రూపంలో నిన్ను
కమ్ముకోనుందో అన్న కలవరం
నిరంతరం మము వెంటాడుతునే వుంది.

ఝాన్సీ లక్ష్మీ భాయ్, రుద్రమ, ఇందిరల
ధైర్యమే నీకు స్ఫూర్తి కావాలి
నీకు అసౌకర్యాన్ని కలిగించే ఏ చిన్న
సంగతైనా, సంకోచం లేకుండా మాతో పంచుకోగలగాలి
భవిష్యత్ ఉపద్రవాలకు
ఆదిలోనే అంతంపలికే అవకాశమివ్వాలి

మా కల కాలం కంటి ముందు
నీ నవ్వులే వెలుగులు చిందుతుండాలి..!
                                                              ( మా బంగారుతల్లులకు తల్లిదండుల తరపున )  

21, సెప్టెంబర్ 2017, గురువారం

బతుకమ్మ చీరలతో అధికార పార్టీ "సెల్ఫ్ గోల్"...?

తెలంగాణాలో  ప్రతిపక్షాల వునికినే ప్రశ్నార్ధకం చేసిన అధికార టి ఆర్ ఎస్ పార్టీ - మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీతో తనంతట తానుగా ప్రతి పక్షాలకు బురదజల్లే  మంచి అవకాశాన్ని ఇచ్చినట్లయ్యింది. ప్రజాకర్షక పథకాలు వికటిస్తే పరిస్థితులు ఎలా వుంటాయొ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే భోధపడుతుంది. 250-300 ల రోజు కూలి మానుకొని పొద్దంతా క్యూ లైన్ లలో నిలబడితే, కనీసం 100 విలువ కూడా చేయని నాసి రకం చీరలు ముఖాన కొట్టారని మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు. చాల చోట్ల ఆ చీరలను రోడ్లపై కుప్పలు పోసి తగులబెడుతున్నారు. బతుకమ్మ చీరలు అందుకున్న మహిళలు ముఖ్యమంత్రికి నీరాజనాలు పలుకుతున్నారని, ప్రతిపక్షాలు ఓర్వలేక చీరలు కాల్చి ఆ నెపం మహిళల పై వేస్తున్నాయని అధికార పక్షం సమర్ధించుకుంటుంది. వాస్తవానికి బతుకమ్మ చీరలులో అంత నాణ్యత లేదన్నది అంగీకరించాల్సిన విషయమే. ఒక్కో చీరకు 300 వరకు ఖర్చు పెట్టటమన్నది నిజమైతే, పొరపాటు ఎక్కడ జరిగిందో విచారించి వాస్తవాలు తెలియజేయాల్సిన భాద్యత ప్రభుత్వం పై వుంది. అప్పటి వరకు ప్రతి పక్షాలు ఈ వివాదాన్ని చల్లారనివ్వవు. తక్కువ ఖర్చు- ఎక్కువ లబ్ధి పొందాలని తొందర పడితే ఇలాగే "సెల్ఫ్ గోల్" పడుతుంది.       

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

ఒకుహరా పై ప్రతీకారం తీర్చుకున్న పి.వి. సింధు

ఇటీవలి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరా చేతిలో పోరాడి, ఓడి రన్నరప్ తో సరిపెట్టుకున్నది మన తెలుగు తేజం పి.వి. సింధు. నేడు సియోల్ లో జరిగిన కొరియన్ ఓపెన్ సిరీస్ ఉమెన్స్ ఫైనల్ లో అదే ఒకుహరా పై అద్వితీయ విజయం సాధించి టైటిల్ గెలుచుకొని మధురమైన ప్రతీకారం తీర్చుకొంది మన సింధు. భారత దేశం తరపున ఈ టైటిల్ సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా సరికొత్త క్రీడా చరిత్ర లిఖించింది. 22-20 తో తొలి గేం పోరాడి గెలుచుకొన్న సింధు రెండో గేం లో తడబడి 11-21 తో ప్రత్యర్ధికి గేం వదులుకుంది. నిర్ణాయక మూడో  గేం లో ఇద్దరూ నువ్వా - నేనా అన్నట్లు ఆడినా చివరికి 21-18 తో సింధు నే విజయం సొంతం చేసుకుంది. ప్రదాని మోఢి తో పాటు ప్రముఖులు అనేకమంది సింధు కు అభినందనలు తెలిపారు. సింధు ఈ విజయ యాత్ర అప్రతిహతంగా కొనసాగిస్తూ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం.        

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

అమెరికా అయినా అమలాపురం అయినా ఒకటే..!




అగ్ర రాజ్యం అమెరికా ఇర్మా హరికేన్ ప్రళయానికి చిగురుటాకులా వణికిపోతుంది. అగ్ర రాజ్యమా, అట్టడుగు రాజ్యమా అన్నది మనుష్యులకేగాని ప్రకృతికి కాదుగా..! సాంకేతికంగా, ఆధునికంగా ప్రపంచాన్నే శాసించే స్థితిలో వున్న అమెరికా నేడు అనాధలా అల్లాడుతుంది.  సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థాయికి మానవ మేధస్సు ఎదిగిపోయింది అని విర్రవీగడం కేవలం మన భ్రమ మాత్రమేనని ప్రకృతి హెచ్చరిస్తుంది.  ఎంత పరిణతి చెందినా మానవ శక్తికి పరిమితులున్నాయని తెలియజేస్తుంది.  మేము ఎక్కువ, మీరు తక్కువ అన్న భేద భావాలు విడనాడి దేశాలు, జాతులు అన్ని కలిసిమెలసి జీవించాలని, ప్రకృతిని గౌరవించాలని ఈ ఉత్పాతం ఉదహరిస్తుంది. 

పాపికొండల్లో పడవ ప్రయాణం

కుటుంబ సమేతంగా జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. తక్కువ వ్యయంలో, తక్కువ సమయంలో (ఒక రోజు) చూసి రాగలిగే మద్యతరగతి బడ్జెట్ ట్రిప్.  పచ్చని ప్రకృతి ఒడిలో,  గల గలా పారే గోదారిపై లాంచీ ప్రయాణంతో జీవన పోరాటంలోని ఒత్తిళ్ళన్ని కాసేపు మర్చిపోయి అద్భుతమైన ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు.  తిరిగి మన జీవన గమనానికి సరి కొత్త వుత్సాహాన్ని రీచార్జ్ చేసుకోవచ్చు.  రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రభుత్వ, ప్రైవేట్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఈ పాపికొండలు లాంచి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుంటారు.  మన తెలుగు సినిమాలు ఎన్నింట్లోనో ఈ పాపికొండలు కనువిందు చేసాయి,చేస్తున్నాయి.  ముఖ్యంగా సేనియర్ దర్శకుడు వంశీ చిత్రాలలో మరింత మనోహరంగా వుటాయి ఈ గోదారి అందాలు.  దర్శకుడు శేఖర్ కమ్ముల "గోదావరి" తో పాపికొండలు లాంచి ప్రయాణానికి మంచి ప్రాచుర్యత లభించింది.  త్వరలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కానున్నందున, అప్పుడు పాపికొండలు పర్యటనలలో ఏ మార్పులు చోటు చేసుకుంటాయొ తెలియనందున - వీలైనంత త్వరలో ఒక చూపు చూసేద్దామా..!         

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...