ఇది వర్షాకాలం. కప్పలకు సందడే సందడి. రానున్నది ఎన్నికల కాలం. రాజకీయ "జంపింగ్ జపాంగ్"లకు వేడుకల కాలం. రాజకీయ పార్టీల ప్రధాన ధ్యేయం, లక్ష్యం - ప్రజాసేవ,సుపరిపాలన. స్వాతంత్ర్యం సిద్దించిన తొలినాళ్ళలో ప్రజాసేవకు తమ స్వంత ఆస్తులను కూడా కరిగించుకొన్న ప్రజా ప్రతినిధులు ఎందరో వున్నారు. స్వతంత్ర్య పోరాటంలో ఎన్నో బాధలుపడి కూడ, తదుపరి కోరి వచ్చిన అధికారాన్ని వద్దనుకున్న మహనీయులు కూడా ఎందరో వున్నారు. మారుతున్న కాలంతోపాటుగా రాజకీయాలలో ఎన్నో మార్పులు. రాను రాను అక్రమ సంపాదన, అధికార కాంక్షలే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యాలుగా మారిపోయాయి. గతంలో ఎవరైనా నాయకుడు తన పార్టీని వీడుతున్నాడు అంటే అందుకు ఎంతో బలమైన కారణం, మరెంతో అంతర్మధనం జరిగేది. ఆ నాయకుడు మరో పార్టీలోకి వెళ్ళాలన్న అంతే ప్రక్రియ జరిగేది. మరి నేడు..? ఉదయం బండబూతులు తిట్టిన పార్టీ అధ్యక్షుడి చేతే పార్టీ కండువా కప్పించుకొని, ఆ వెంటనే తన పాత పార్టీని, నాయకులను దుమ్మెత్తిపోస్తునారు. ఇంత త్వరగా రంగులు మార్చడం తమకు కూడా సాద్యంకాదని ఊసరవెల్లులు ఆశ్చర్య పోతుంటే, ఈ "జంపింగ్ జపాంగ్"ల గంతుల ముందట తామేపాటి అని కప్పలు నోరు వెళ్ళబెడుతున్నాయి. దీనికి దాదాపు అన్నిపార్టీల భాద్యత ఉంది. నాయకుల ఆర్ధిక, వర్గ, సామాజిక బలం చూసి ,తాయిలాలు ఆశ పెట్టి పార్టీలోకి లాక్కొంటున్నాయి. ఆ వచ్చిన వారికి వెంటనే పార్టీ పదవులు, ఎన్నికలలో సీట్లు ఇచ్చి ప్రధాన్యత ఇస్తున్నారు. ముందుగా మారాల్సింది పార్టీల నడవడికే. నాయకులు పార్టీలు మారినంత తేలికగా కార్యకర్తలు మనసు చంపుకొని పార్టీలు మారలేరు. ఏ కొందరో తప్పించి అసలైన కార్యకర్తలు పార్టీ అధికారంలో వున్నా, లేకున్నా వెన్నంటే వుంటారు. పార్టీలకు అసలైన బలం, పునాదులు వీరే. వాళ్ళ కుటుంబాలు తరతరాలుగ పార్టీని అంటే పట్టుకొని వుంటారు. అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుంది. అప్పుడు కార్యకర్తలలోనే కాదు, ప్రజలలో కూడా పార్టీ పట్ల నిబద్దత ఏర్పడుతుంది. తరచుగా పార్టీలు మారే "జంపింగ్ జపాంగ్"లు కూడా తమ దూకుడు తగ్గించుకుంటారు. వీరు తమ పార్టీ మారడానికి చెప్పే ఏకైక కారణం "ప్రజల క్షేమం కోసమే". నిజానికి ఇటువంటి నాయకులు అసలు రాజకీయలలో వుండక పోవడమే ప్రజలకు క్షేమం కదా..! ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి విన్యాసాలు తిలకించడానికి సిద్దంగా వుండండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?
జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం. జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...

-
"నాన్నా..నాన్నా...నాన్నా.." రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో నాలుగేళ్ళు నిండిన చింటూ ఏడుపు...
-
అది 1992-93 కాలం. అత్తెసరు చదువుతో.. అద్భుత భవిష్యత్ కోసం.. ఆరాటపడుతూ... ఆప్త మితృడు భయ్యా( మా ఇంటి అనధికార దత్తపుత్రుడు)తో జీవనపోరాటం...
-
జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం. జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి