హైద్రాబాద్ ..విశ్వనగరంగా ప్రస్థావించబడుతున్న మన భాగ్యనగరం. హైద్రాబాద్ అభివృద్ది మా హయాంలో జరిగిందంటే, కాదు.. మా పరిపాలనలోనే జరిగిందని జబ్బలు చరుచుకుంటుంటాయి మన రాజకీయ పక్షాలు. ఇదంతా కాదు నైజాం పాలనలోనే హైద్రాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా కీర్తి గడించిందంటారు మరికొంత మంది. ప్రస్తుతం గట్టిగా నాలుగు చినుకులు పడితే హైదరాబాద్ రోడ్లు భారీ జల రవాణా మార్గాలుగా మారిపోతున్నాయి. ఒక మోస్తరు వర్షం వస్తే స్కూల్స్, కాలేజెస్, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలన్నిటికి సెలవులు ప్రకటించాల్సిందే. సాధారణ ప్రజలు గంటల కొద్ది ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఏ ఒక్కరు కూడా ఇది మా ఘనతే అని నోరు విప్పరే..? మహా భారత యుద్దంలో "అశ్వత్థామ హతహ్, కుంజరహ" లానే, ప్రస్తుతం మనం కూడా " హైదరాబాద్ విశ్వనగరం- వర్షాకాలం తప్పించి" అని నినదిద్దామా..! లేకపోతే " వర్షాకాలంలో వెనిస్ నగరాన్ని తలపించే హైదరాబాద్ జల సోయగాలు" అని పర్యాటక ప్రచారం చేసుకొనే అవకాశం ప్రభుత్వానికి కలుగుతుందని సరిపుచ్చుకుందామా..?
ప్రతీ ఇంటికీ నీరు అనుకున్నాం...ప్రతీ ఇంట్లోకీ నీరు వచ్చింది :)
రిప్లయితొలగించండి