ఇటీవలి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరా చేతిలో పోరాడి, ఓడి రన్నరప్ తో సరిపెట్టుకున్నది మన తెలుగు తేజం పి.వి. సింధు. నేడు సియోల్ లో జరిగిన కొరియన్ ఓపెన్ సిరీస్ ఉమెన్స్ ఫైనల్ లో అదే ఒకుహరా పై అద్వితీయ విజయం సాధించి టైటిల్ గెలుచుకొని మధురమైన ప్రతీకారం తీర్చుకొంది మన సింధు. భారత దేశం తరపున ఈ టైటిల్ సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా సరికొత్త క్రీడా చరిత్ర లిఖించింది. 22-20 తో తొలి గేం పోరాడి గెలుచుకొన్న సింధు రెండో గేం లో తడబడి 11-21 తో ప్రత్యర్ధికి గేం వదులుకుంది. నిర్ణాయక మూడో గేం లో ఇద్దరూ నువ్వా - నేనా అన్నట్లు ఆడినా చివరికి 21-18 తో సింధు నే విజయం సొంతం చేసుకుంది. ప్రదాని మోఢి తో పాటు ప్రముఖులు అనేకమంది సింధు కు అభినందనలు తెలిపారు. సింధు ఈ విజయ యాత్ర అప్రతిహతంగా కొనసాగిస్తూ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధిస్తుందని ఆశిద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?
జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం. జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...

-
"నాన్నా..నాన్నా...నాన్నా.." రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో నాలుగేళ్ళు నిండిన చింటూ ఏడుపు...
-
అది 1992-93 కాలం. అత్తెసరు చదువుతో.. అద్భుత భవిష్యత్ కోసం.. ఆరాటపడుతూ... ఆప్త మితృడు భయ్యా( మా ఇంటి అనధికార దత్తపుత్రుడు)తో జీవనపోరాటం...
-
జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం. జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి