21, సెప్టెంబర్ 2017, గురువారం

బతుకమ్మ చీరలతో అధికార పార్టీ "సెల్ఫ్ గోల్"...?

తెలంగాణాలో  ప్రతిపక్షాల వునికినే ప్రశ్నార్ధకం చేసిన అధికార టి ఆర్ ఎస్ పార్టీ - మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీతో తనంతట తానుగా ప్రతి పక్షాలకు బురదజల్లే  మంచి అవకాశాన్ని ఇచ్చినట్లయ్యింది. ప్రజాకర్షక పథకాలు వికటిస్తే పరిస్థితులు ఎలా వుంటాయొ ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే భోధపడుతుంది. 250-300 ల రోజు కూలి మానుకొని పొద్దంతా క్యూ లైన్ లలో నిలబడితే, కనీసం 100 విలువ కూడా చేయని నాసి రకం చీరలు ముఖాన కొట్టారని మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు. చాల చోట్ల ఆ చీరలను రోడ్లపై కుప్పలు పోసి తగులబెడుతున్నారు. బతుకమ్మ చీరలు అందుకున్న మహిళలు ముఖ్యమంత్రికి నీరాజనాలు పలుకుతున్నారని, ప్రతిపక్షాలు ఓర్వలేక చీరలు కాల్చి ఆ నెపం మహిళల పై వేస్తున్నాయని అధికార పక్షం సమర్ధించుకుంటుంది. వాస్తవానికి బతుకమ్మ చీరలులో అంత నాణ్యత లేదన్నది అంగీకరించాల్సిన విషయమే. ఒక్కో చీరకు 300 వరకు ఖర్చు పెట్టటమన్నది నిజమైతే, పొరపాటు ఎక్కడ జరిగిందో విచారించి వాస్తవాలు తెలియజేయాల్సిన భాద్యత ప్రభుత్వం పై వుంది. అప్పటి వరకు ప్రతి పక్షాలు ఈ వివాదాన్ని చల్లారనివ్వవు. తక్కువ ఖర్చు- ఎక్కువ లబ్ధి పొందాలని తొందర పడితే ఇలాగే "సెల్ఫ్ గోల్" పడుతుంది.       

1 కామెంట్‌:

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...