వీధిలోను, నడిచే దారిలోను, బస్, రైళ్ళలోను,
బడిలోను, కళాశాలలోను...అన్ని చోట్లా విచ్చుకున్నాయి, విచక్షణ లేని
రొచ్చు ముళ్ళు.
కనుపాపలా అనుక్షణం నిను
కాచుకొంటున్నా,
ఏ ముప్పు ఏ రూపంలో నిన్ను
కమ్ముకోనుందో అన్న కలవరం
నిరంతరం మము వెంటాడుతునే వుంది.
ఝాన్సీ లక్ష్మీ భాయ్, రుద్రమ, ఇందిరల
ధైర్యమే నీకు స్ఫూర్తి కావాలి
నీకు అసౌకర్యాన్ని కలిగించే ఏ చిన్న
సంగతైనా, సంకోచం లేకుండా మాతో పంచుకోగలగాలి
భవిష్యత్ ఉపద్రవాలకు
ఆదిలోనే అంతంపలికే అవకాశమివ్వాలి
మా కల కాలం కంటి ముందు
నీ నవ్వులే వెలుగులు చిందుతుండాలి..!
( మా బంగారుతల్లులకు తల్లిదండుల తరపున )
బంగారు తల్లుల భవిష్యత్తు బాగుండాలి.
రిప్లయితొలగించండి